ABOUT AUTHOR

రచయిత గురించి.. 

సీతారామ కథాసుధ గ్రంథకర్త దీక్షితుల సుబ్రహ్మణ్యం. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్రామాయణ మధుర కావ్యాన్నిఅతి మధురంగా, సులభమైన శైలిలో అందరికీ అర్థం అయ్యేలా మాత్రమే కాక.. మూలంలో ఉన్నంత సవివరంగా కూడా అందించిన ఆయన శైలి సుమధురం. ఇది ద్రాక్షాపాకమే కాక సర్వజన రంజకం. అనేక దేశాల్లో వేలాదిమందిని సీతారామ కథాసుధ రంజింప జేసింది.. ఇంకా రంజింప జేస్తున్నది. ఈ సుమధుర రామచరితం ఇంతవరకు బాల, అయోధ్య, అరణ్య కాండలు విడుదలయ్యాయి. ఇంకా మూడు భాగాలు మార్కెట్లోకి రావలసి ఉంది. ద్వితీయ ముద్రణ కూడా జరుపుకొని అద్భుతమైన జనాదరణను, అందరి ఆదరాభిమానాలను, అపార శ్రీరామానుగ్రహాన్ని సొంతం చేసుకున్న గ్రంథాలివి. 

No comments:

Post a Comment